Hrithika Srinivas: యూత్ దృష్టిని ఆకర్షిస్తున్న బెంగుళూర్ బ్యూటీ .. హ్రితిక శ్రీనివాస్!

Hrithika Srinivas Intervoew

  • ఈ నెల 24న 'సౌండ్ పార్టీ' రిలీజ్ 
  • హీరోయిన్ గా ఆమని మేనకోడలు
  • చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశానని వెల్లడి  
  • 'శుభలగ్నం' ఇష్టమని చెప్పిన బ్యూటీ

హ్రితిక శ్రీనివాస్ .. 'అల్లంత దూరాన' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన బెంగళూరు బ్యూటీ. అయితే ఆ సినిమాకి సరైన పబ్లిసిటీ చేయకపోవడం వలన ఎప్పుడు థియేటర్స్ కి వచ్చిపోయిందనేది చాలామందికి తెలియదు. అందువలన హ్రితిక శ్రీనివాస్ ను ఆడియన్స్ పెద్దగా గుర్తుపెట్టుకోలేదు.

హ్రితిక శ్రీనివాస్ ఎవరో కాదు .. సీనియర్ హీరోయిన్ ఆమనికి మేనకోడలు. ఆమె తాజా చిత్రంగా 'సౌండ్ పార్టీ' సినిమా రూపొందింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఐ డ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకుంది. 

"నేను పుట్టింది చెన్నైలో .. ప్రస్తుతం ఉంటుంది బెంగుళూరులో. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో చేసిన అనుభవం ఉంది. ఇక మా మేనత్తను దగ్గరగా చూస్తూ పెరగడం వలన సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఆమె చేసిన సినిమాల్లో 'శుభలగ్నం' అంటే చాలా ఇష్టం. ఆ సినిమాను నాతో రీమేక్ చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను. తమిళ .. కన్నడ సినిమాల్లోను చేశాను. 'సౌండ్ పార్టీ'తో సక్సెస్ అందుకుంటాననే నమ్మకం ఉంది" అని చెప్పింది.

Hrithika Srinivas
Actress
Sound Party
  • Loading...

More Telugu News