Allu Arjun: తమ గారాల పట్టి ‘అల్లు అర్హ’ వీడియోను షేర్ చేసిన బన్నీ.. ఇదిగో వీడియో

Allu Arjun shared the video of his daugher Allu Arha

  • తన సంతోషాల సమూహం అర్హ అని వీడియో షేర్ చేసిన ఐకాన్ స్టార్
  • డాడీ ముద్దులు పెడుతుంటే సరదాగా దూరం జరిగిన అర్హ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడిపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటాడు. కొడుకు, కూతురితో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. ముఖ్యంగా తన గారాల పట్టి ‘అల్లు అర్హ’తో ప్రత్యేక ఎమోషన్ కలిగివుంటాడు. కళ్లెదుట తన ముద్దుల కూతురి అల్లరిని చూసి మురిసిపోతుంటానని గతంలో పలు ఇంటర్వ్యూల్లో కూడా పంచుకున్నాడు. సోషల్ మీడియా మాధ్యమాల్లో తరచూ అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసే ఐకాన్ స్టార్ తాజాగా మరో వీడియోను పంచుకున్నాడు.

చిన్నారి ‘అల్లు అర్హ’ను ముద్దాడుతున్న వీడియోను అల్లు అర్జున్ షేర్ చేశాడు. ‘ నా సంతోషాల సమూహం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. డాడీ ముద్దులు పెడుతుంటే దూరంగా జరుగుతూ, చేతులు అడ్డుపెట్టుకుంటూ వీడియోలో అర్హ కనిపించింది. కూతురిని చూస్తూ అల్లు అర్జున్ మురిసిపోతూ కనిపించాడు. సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్‌లో అర్జున్ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురిపట్ల ప్రేమ చూపిస్తున్న తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తండ్రీకూతుళ్ల ప్రేమ చూడముచ్చటగా ఉందని, ఎల్లప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Allu Arjun
Allu Arha
Tollywood
Movie news

More Telugu News