Pawan Kalyan: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వపన్ శ్రీకారం.. ఈరోజు, రేపటి షెడ్యూల్ ఇదిగో!

Pawan Kalyan Telangana election campaigning

  • నేడు వరంగల్ లో బీజేపీ విజయసంకల్ప సభ
  • బీజేపీ సభలో పాల్గొననున్న పవన్
  • రేపు మూడు నియోజకవర్గాల్లో కొనసాగనున్న పర్యటన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఈ రోజు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు, రేపు జరగబోయే పవన్ సభలకు సంబంధించిన వివరాలను జనసేన విడుదల చేసింది. ఈరోజు వరంగల్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరగనున్న విజయసంకల్ప సభలో పవన్ పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తులో భాగంగా ఆ పార్టీ తరపున వపన్ ప్రచారం చేయనున్నారు. వరంగల్ సభ ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. రేపు ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట, సాయంత్రం 4.30 గంటలకు దుబ్బాక నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పవన్ ప్రసంగిస్తారు. పవన్ పాల్గొనే ఇతర కార్యక్రమాల షెడ్యూల్ ను తదుపరి ప్రకటిస్తామని జనసేన తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News