Akkineni Nagachaitanya: అభిమానుల వద్దకు వెళ్లి ఆశ్చర్యపరిచిన నాగచైతన్య... వీడియో ఇదిగో!

Akkineni Naga Chaitanya met fans personally

  • 'దూత' వెబ్ సిరీస్ లో నటించిన నాగచైతన్య
  • అమెజాన్ ప్రైమ్ తో కలిసి వినూత్న కార్యక్రమానికి రూపకల్పన
  • అభిమానుల వద్దకు సడన్ ఎంట్రీ ఇచ్చిన వైనం... వీడియో వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తన అభిమానుల వద్దకు స్వయంగా వచ్చి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. నాగచైతన్య 'దూత' అనే వెబ్ సిరీస్ లో నటించారు.  ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోతో కలిసి ఓ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. 

అందులో భాగంగానే అభిమానుల వద్దకు నాగచైతన్య వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నాగచైతన్య వెళ్లకముందు ఓ యూట్యూబర్ వారిని ప్రశ్నలు అడుగడం ఈ వీడియోలో చూడొచ్చు. 

ఈ నెల 23న నాగచైతన్య పుట్టినరోజు కాగా, నాగచైతన్యకు బర్త్ డే విషెస్ ఎలా చెబుతారు? నాగచైతన్య అంటే ఎందుకు ఇష్టం? వంటి ప్రశ్నలు అడుడుగుతుండగానే, నాగచైతన్య సడన్ గా ఎంట్రీ ఇవ్వడం వీడియోలో హైలైట్ గా నిలిచింది. తన అభిమానులను కలిసిన నాగచైతన్య వారితో తన కెరీర్ విషయాలు, తన మొదటి వెబ్ సిరీస్ దూత సంగతులు పంచుకున్నారు.

More Telugu News