KA Paul: మోదీ, జీవీఎల్ పై నిప్పులు చెరిగిన కేఏ పాల్

KA Paul fires on PM Modi and GVL

  • విశాఖలో మత్స్యకారుల బోట్లు దగ్ధం
  • మోదీ, జీవీఎల్ ఎందుకు స్పందించలేదన్న కేఏ పాల్
  • తెలుగు సత్తా ఏంటో గుజరాతీలకు చూపిద్దామని పిలుపు

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో పెద్ద సంఖ్యలో బోట్లు దగ్ధమైన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇంతవరకు స్పందించలేదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. 

40 బోట్లు కాలిపోతే... సిటీ అంతా తగలబడిపోతుంటే... ప్రధానమంత్రి పడుకున్నాడా? జీవీఎల్ నరసింహారావు ఏం చేస్తున్నాడు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమైనా అంటే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడతారు, మన తెలుగువారిని తిడతారు అని విమర్శించారు.

"ఒరేయ్ మూర్ఖులారా... నిన్ను ఒకటే అడుగుతున్నాను జీవీఎల్... నీకు, నీ ప్రధానమంత్రికి సిగ్గుందా! మీ గుజరాతీలు అదానీలు వచ్చి మా పోర్టును దోచుకుంటారు, రూ.8 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ ను దోచుకుంటారు. ఈ పదేళ్లలో అప్పులపాలైన మా రాష్ట్రం నుంచి లక్షల కోట్లు దోచుకుని గుజరాత్ లో స్టేడియంలు  కడతారు... గుజరాత్ ను అభివృద్ధి చేసుకుంటారు... మాకు నరకం చూపిస్తారు. మాకు ప్రత్యేకహోదా ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, స్టీల్ ప్లాంట్ దోచుకుంటున్నారు.

లక్షలాది నిరుద్యోగులు నాశనమై పోతుంటే... మా రాష్ట్రంలో తిరగడానికి మీకు, మీ బీజేపీ వాళ్లకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుక్కుంటున్నారు? ఒరేయ్... కనీసం ఒక్కసారైనా మన తెలుగు సత్తా ఈ మోదీకి, ఈ బీజేపీకి, ఈ జీవీఎల్ కు చూపిద్దాం. ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిద్దాం. మన తెలుగువాళ్లంటే ఏంటో గుజరాతీలకు చూపిద్దాం" అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.

KA Paul
Narendra Modi
GVL Narasimha Rao
Boats
Fire Accident
Visakhapatnam
  • Loading...

More Telugu News