vijaya reddy: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతు

TDP supports Congress Vijaya Reddy

  • ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ వర్గాల మద్దతు తమకు ఎంతో కీలకమన్న విజయారెడ్డి
  • ఎన్టీఆర్, పీజేఆర్ ప్రజల కోసం పని చేసిన నాయకులు అని కితాబు
  • విజయారెడ్డికి అద్భుత విజయాన్ని అందిస్తామన్న టీడీపీ నేతలు

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి స్థానిక తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ వర్గాల మద్దతు తమకు ఎంతో కీలకమన్నారు. ఎన్టీఆర్, పీజేఆర్‌లు ప్రజల కోసం పని చేసిన నాయకులు అన్నారు. తాను కూడా వారి అడుగుజాడల్లో నడుస్తున్నానని, అలాంటి తనకు టీడీపీ శ్రేణుల మద్దతు ఎంతో ప్రయోజనకరమన్నారు. అందరినీ కలుపుకుపోతూ కాంగ్రెస్‌తో పాటు టీడీపీ నాయకుల సూచనల మేరకు ప్రజల్లోకి వెళ్తానన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాను పని చేస్తానని హామీ ఇచ్చారు.

టీడీపీ మద్దతు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డికి టీడీపీ మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేతలతో కలిసి విజయారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో విజయారెడ్డికి అద్భుత విజయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఖైరతాబాద్ ప్రజలకు సేవ చేసి పీజేఆర్, ఎన్టీఆర్ వలె పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

vijaya reddy
Congress
Telugudesam
Telangana Assembly Election
  • Loading...

More Telugu News