Saindhav: 'సైంధవ్' నుంచి ఫస్టు సింగిల్ రిలీజ్ .. ఈవెంటులో సందడి చేసిన వెంకీ!

- శైలేశ్ కొలను నుంచి 'సైంధవ్'
- వెంకీ కెరియర్లో మరో యాక్షన్ థ్రిల్లర్
- ఇది తన 75వ సినిమా అని చెప్పిన వెంకీ
- జనవరి 13వ తేదీన సినిమా విడుదల
వెంకటేశ్ హీరోగా శైలేశ్ కొలను 'సైంధవ్' సినిమాను రూపొందించాడు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంటులో వెంకటేశ్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య సందడి చేశారు.

'సైంధవ్' విషయానికి వచ్చేసరికి ఇది చాలా స్పెషల్ సినిమా .. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. 'రాంగ్ యూసేజ్' అనే సాంగ్ విషయానికి వస్తే, సెల్ ఫోన్స్ వాడకం గురించి లెక్చర్ లా కాకుండా చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుంది. మీరంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను" అని అన్నారు.