Ritu Chowdary: నాన్నకి గుండెనొప్పి వస్తున్నా నన్ను నిద్రలేపలేదు: 'జబర్దస్త్' రీతూ చౌదరి

Ritu Chowdary Interview

  • 'జబర్దస్త్'తో రీతూ చౌదరికి పేరు
  • తండ్రి మరణం పట్ల కన్నీళ్లు 
  • తన కారు అంటే ఆయనకి ఇష్టమని వెల్లడి 
  • తండ్రి మరణాన్ని నమ్మలేకపోయానని వ్యాఖ్య   


'జబర్దస్' కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారి జాబితాలో, రీతూ చౌదరి పేరు కూడా కనిపిస్తుంది. తాజాగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తండ్రి హఠాన్మరణాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంది. "మా నాయనమ్మ సంవత్సరీకం కోసం మేము మా సొంతూరు వెళ్లాము. ఆ రోజు రాత్రి మేము జోక్స్ కూడా వేసుకుని నవ్వుకున్నాము. 

ఊళ్లో మా ఇంటి ముందు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్నాము .. సెల్ఫీస్ తీసుకున్నాము. ఆ తరువాత నేను పడుకున్నాను .. ఉదయాన్నే డాడీ చనిపోయాడంటూ మా బాబాయ్ నిద్రలేపాడు. మా నాన్నకి గుండెల్లో నొప్పి వస్తుంటే వచ్చి నా పక్కన పడుకున్నాడట. నొప్పి వస్తున్నా ఆయన నన్ను లేపడానికి ఇష్టపడలేదట. 

రాత్రి మాతో జోక్ చేసిన నాన్న ... పొద్దున్నే ప్రాణాలతో లేడంటే నేను నమ్మలేకపోయాను. నేను సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న కారు అంటే ఆయనకి ఇష్టం. ఆ కార్లోనే ఆయనను అలా వెనెక సీట్లో పడుకోబెట్టి తీసుకుని రావలసి వచ్చింది. ఇప్పటికీ నేను ఒక్కదానినే కారులో వెళుతున్నా, మా నాన్న నాతోనే ఉన్నాడనుకుని మాట్లాడుతూనే ఉంటాను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

Ritu Chowdary
Actress
Jabardasth
  • Loading...

More Telugu News