Joju George: మలయాళం నుంచి వచ్చిన మరో స్టార్ హీరో!

Joju George Special

  • మలయాళంలో స్టార్ హీరోగా జోజు జార్జ్ 
  • ఓటీటీ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి చేరువ 
  • 'ఆదికేశవ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ 
  • ఈ నెల 24వ తేదీన విడుదలవుతున్న సినిమా   


మలయాళం నుంచి గతంలో మోహన్ లాల్ .. మమ్ముట్టి .. సురేశ్ గోపి మాత్రమే ఇక్కడి ఆడియన్స్ కి తెలిసినవారు. ఈ మధ్య కాలంలో ఓటీటీ సినిమాల కారణంగా అక్కడి ఆర్టిస్టులు చాలామంది తెలుస్తున్నారు. వాళ్లలో చాలామంది తెలుగు సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఫహాద్ ఫాజిల్ .. షైన్ టామ్ చాకో అలా వచ్చినవారే. 

తాజాగా ఆ జాబితాలో జోజు జార్జ్ కూడా చేరిపోయాడు. మలయాళంలో 1995 నుంచి జోజు జార్జ్ కెరియర్ మొదలైంది. ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలలో ఆయన ఒకరు. మంచి పర్సనాలిటీ .. అందుకు తగిన హైటూ .. బొద్దు మీసాలతో మనిషి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటాడు.

తెలుగులో రాజశేఖర్ చేసిన 'శేఖర్' (జోసఫ్) సినిమా, మలయాళంలో జోజు జార్జ్ చేసిందే. ఇప్పుడు 'కోట బొమ్మాళి పీఎస్'లో శ్రీకాంత్ చేసిన పాత్ర .. 'నాయట్టు'లో జోజు జార్జ్ పోషించినదే. ఇక 'ఇరట్ట' ఓటీటీ సినిమా ద్వారా కూడా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన 'ఆదికేశవ' సినిమాలో ప్రతినాయకుడిగా జోజు జార్జ్ నటించాడు. తెలుగులో ఆయన చేసిన ఫస్టు మూవీ ఇదే. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది.

Joju George
Vaishnav Tej
Adi Keshava
  • Loading...

More Telugu News