Chiranjeevi: త్రిషపై మన్సూర్ అలీఖాన్ రేప్ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన

Chiranjeevi reacts to Mansoor rape remarks on Trisha

  • త్రిషతో రేప్ సీన్ ఉంటుందని భావించానన్న మన్సూర్
  • ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలన్న చిరంజీవి
  • వక్ర బుద్ధితో కొట్టుమిట్టాడుతున్నారని మండిపాటు

ప్రముఖ సినీ నటి త్రిషపై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఎన్నో సినిమాల్లో రేప్ సీన్స్ లో నటించానని... 'లియో' చిత్రంలో ఆఫర్ వచ్చినప్పుడు కూడా త్రిషతో రేప్ సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని భావించానని... కానీ ఆ సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధపడ్డానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన్సూర్ వ్యాఖ్యలపై పలువురు ఇప్పటికే మండిపడ్డారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించారు. 

త్రిష గురించి మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని చిరంజీవి తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేవలం సినీ ఆర్టిస్టులకే కాకుండా ఏ మహిళకైనా లేదా ఏ అమ్మాయికైనా అసహ్యంగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండించాలని అన్నారు. వక్ర బుద్ధితో వారు కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. త్రిషతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులుగా మారిన ప్రతి మహిళకు తాను అండగా నిలబడతానని అన్నారు.

Chiranjeevi
Tollywood
Trisha
Mansoor Ali Khan
Rape Remarks
  • Loading...

More Telugu News