BRS: రైతుబంధు, ఉద్యోగుల డీఏలపై కేసీఆర్ ప్రభుత్వానికి ఈసీ షాక్

EC shocks BRS government over Rythu Bandhu and DA
  • రైతుబంధు, ఉద్యోగుల డీఏ, రైతు రుణమాఫీకి అనుమతివ్వాలని ఈసీని సంప్రదించిన కేసీఆర్ ప్రభుత్వం
  • అధికార పార్టీ విజ్ఞప్తులను తిరస్కరించిన ఎన్నికల కమిషన్
  • రైతుబంధు ఆపాలంటూ తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఈసీ స్పష్టీకరణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. రైతుబంధు, ప్రభుత్వ ఉద్యోగుల డీఏలు, రైతు రుణమాఫీల జారీకి అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వం... రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. అయితే అధికార పార్టీ విజ్ఞప్తులను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. పెండింగ్ డీఏలు ఇప్పుడు ఎలా ఇస్తారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది. అలాగే రైతుబంధు ఆపాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈసీని ఆశ్రయించిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీనిపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టతనిచ్చారు. రైతుబంధు ఆపాలంటూ తమకు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. 
BRS
State Election Commission
Telangana Assembly Election

More Telugu News