Justice Markandey Katju: ఆస్ట్రేలియా విజయానికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి చెప్పిన కారణం వింటే మతిపోవడం ఖాయం!
- వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలైన టీమిండియా
- రికార్డు స్థాయిలో 6వ సారి వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
- ఆసీస్ విజయానికి మహాభారత రోజులకు ముడేసిన జస్టిస్ కట్జూ
దేశ న్యాయవ్యవస్థలో జస్టిస్ మార్కండేయ కట్జూ ఎంతో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గానూ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గానూ వ్యవహరించారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడిస్తారని ఆయనకు పేరుంది. అటువంటి జస్టిస్ మార్కండేయ కట్జూ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయానికి చెప్పిన కారణం వింటే మతిపోవడం ఖాయం. ఆస్ట్రేలియా విజయానికి మహాభారత కాలం నాటి రోజులకు ఆయన ముడేసిన తీరు దిమ్మదిరిగేలా చేస్తుంది.
"ఆస్ట్రేలియా గడ్డ ఆనాడు పాండవులు తమ అస్త్రాలు భద్రపరుచుకునే కేంద్రంగా ఉండేది. అప్పట్లో దాన్ని 'అస్త్రాలయ' అని పిలిచేవారు. ఆస్ట్రేలియన్లు వరల్డ్ కప్ నెగ్గడానికి అసలైన కారణం ఇదే" అని జస్టిస్ మార్కండేయ కట్జూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్ల స్పందన మామూలుగా లేదు. కట్జూపై తలోరకంగా స్పందిస్తున్నారు.