Perfume: అతను అమ్మాయిలను టార్గెట్ చేయడానికి అదే కారణం: 'పర్ ఫ్యూమ్' ట్రైలర్ రిలీజ్!

Perfume movie trailer released

  • సైకో థ్రిల్లర్ కంటెంట్ తో 'పర్ ఫ్యూమ్'
  • దర్శకత్వం వహించిన దుర్గస్వామి 
  • సంగీతాన్ని అందించిన అజయ్ అరసాడ
  • ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల  


ఒక్కో సైకో కిల్లర్ ఒక్కో కారణంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఉంటారు. అలా ఈ సినిమాలో కూడా ఒక కారణంగా అమ్మాయిలను ఓ సైకో ఫాలో అవుతూ ఉంటాడు. సమయం .. సందర్భం కలిసొస్తే తన వలలో వేసుకుంటూ ఉంటాడు. ఈ సినిమా టైటిల్ 'పర్ ఫ్యూమ్' కావడం వలన, ఆ సైకో కొంతమంది అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. 
 
ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది స్మెల్ బేస్డ్ థ్రిల్లర్ స్టోరీ అనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. స్మెల్ కారణంగా ఒక సైకో అమ్మాయిలను వెంటాడటం .. వేటాడటం .. ప్రేమ పేరుతో వేధించడం ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది. అతణ్ణి పట్టుకోవడానికి పోలీస్ టీమ్ సతమతమవుతూ ఉంటుంది.

చేనాగ్ .. ప్రాచీ థాకర్ .. అభినయ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, సుధాకర్ - రాజీవ్ కుమార్  నిర్మించారు. దుర్గాస్వామి దర్శకత్వం వహించాడు. అజయ్ అరసాడ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తున్నారు. 

More Telugu News