Bigg Boss 7: 'బిగ్ బాస్'లో సండే రోజున ఇచ్చిన ట్విస్ట్ ఇదే!

Bigg Boss 7 Update

  • సండేరోజున జరగని ఎలిమినేషన్ 
  • ఎవిక్షన్ పాస్ కారణమని చెప్పిన నాగ్ 
  • ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వెల్లడి 
  • హౌస్ లో పెరిగిపోయిన టెన్షన్ 


బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం నెమ్మది నెమ్మదిగా వేడెక్కుతోంది. క్రితం వారం నామినేషన్స్ లో శోభ .. అమర్ .. అర్జున్ .. గౌతమ్ .. రతిక .. అశ్వని ఉన్నారు. నిన్న సండే రోజున అర్జున్ .. అమర్ .. శోభ ... రతిక సేఫ్ అయ్యారు. దాంతో ఎలిమినేషన్ రౌండ్ లోకి గౌతమ్ - అశ్వని చేరుకున్నారు. 
 
దాంతో చాలామంది అశ్వని బయటికి వెళ్లిపోతుందని అనుకున్నారు. ఆమె కూడా అదే ఆలోచనతో చాలా టెన్షన్ పడిపోయింది. ఇక గౌతమ్ కూడా ఎలిమినేట్ అవుతాడేమోననే డౌట్ కొంతమందికి వచ్చింది. కానీ అందరికీ షాక్ ఇస్తూ, ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు. 

ఎవిక్షన్ పాస్ విషయంలో యావర్ తీసుకున్న నిర్ణయం కారణంగా, ఎలిమినేషన్ లేదని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బాంబ్ పేల్చారు. దాంతో హౌస్ లోని సభ్యులందరిలోను టెన్షన్ కనిపించింది. ఇక ఈ రోజున జరిగే నామినేషన్స్ పై ఈ ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News