Anand Mahindra: టీమిండియా వైఫల్యం నుంచి నేను నేర్చుకున్నది ఇదే: ఆనంద్ మహీంద్రా

Anand Mahindras reaction to Indias defeat to Australia
  • వరల్డ్ కప్‌లో భారత్ ఓటమిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా
  • టీమిండియా అద్భుతంగా రాణించిందంటూ కితాబు
  • కష్టసమయంలో వారికి భారతీయులందరూ మద్దతుగా నిలవాలని వ్యాఖ్య
వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. గెలుపు కోసం పోరాడిన టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. గెలుపోటమలు, జీవిత సత్యాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

‘‘అణుకువ, వినయం నేర్పించడంలో క్రీడలకు మించిన గురువు ఎవరూ లేరు. అయితే, ఏ రకంగా చూసినా టీమిండియా అద్భుతంగా రాణించింది. ఆశించిన దానికంటే ఎక్కువ విజయాలే సొంతం చేసుకుంది. ఈ సమయంలో మనందరం భారత క్రీడాకారులకు అండగా నిలవాలి. కానీ.. జీవితంలో ముందుకు సాగాలంటే ఓటమిని కూడా అంగీకరించాలి, స్వీకరించాలి. ఆ భావాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయకూడదు. నేను నేర్చుకున్నది ఇదే. కాబట్టి, నా పరిస్థితిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నా’’ అంటూ ఆనంద్ మహీంద్రా ఓ పిక్ షేర్ చేశారు. మరో అవకాశం, అద్భుతం కోసం ఒంటరిగా ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. నెటిజన్లు యథాప్రకారం ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
Anand Mahindra
India
Australia

More Telugu News