Karthika Nair: కేరళలో రాధ కుమార్తె కార్తీక వివాహం... హాజరైన చిరంజీవి, సురేఖ

Chiranjeevi attends Radha daughter Karthika wedding

  • గతంలో తెలుగులో పలు చిత్రాల్లో నటించిన కార్తీక
  • ఈ ఉదయం కేరళలోని తిరువనంతపురంలో వివాహం
  • రోహిత్ మీనన్ తో మూడు ముళ్ల బంధం
  • హాజరైన రాధిక, శరత్ కుమార్, సుహాసిని, రేవతి తదితరులు

అలనాటి అందాల భామ, డ్యాన్సింగ్ క్వీన్ రాధ కుమార్తె కార్తీక వైవాహిక బంధంలోకి ప్రవేశించింది. కేరళలో కార్తీక వివాహం రోహిత్ మీనన్ తో ఘనంగా జరిగింది. ఈ ఉదయం జరిగిన కార్తీక వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల, సుహాసిని, రాధిక, శరత్ కుమార్, రేవతి, మేనక తదితరులు హాజరయ్యారు. కార్తీక వివాహం తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. కేరళ సంప్రదాయాల ప్రకారం కార్తీక-రోహిత్ మీనన్ ల వివాహం నిర్వహించారు.

కార్తీక కూడా తల్లి రాధ బాటలోనే పలు సినిమాల్లో నటించారు. 2009లో నాగచైతన్య సరసన జోష్ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. జీవాతో కలిసి నటించిన రంగం చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ తో దమ్ము, అల్లరి నరేశ్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాల్లోనూ నటించిన కార్తీక 2015 తర్వాత మరే చిత్రంలోనూ నటించలేదు. ఆమె వ్యాపార రంగంలో ప్రవేశించినట్టు తెలుస్తోంది. 


More Telugu News