World Cup 2023: ప్రపంచకప్ ట్రోఫీతో భారత్, ఆస్ట్రేలియా స్కిప్పర్ల ఫొటోషూట్ వైరల్.. ఫొటోలు ఇవిగో!
![Team India and Australia Skippers Pre Shoot With World Cup Trophy Goes Viral](https://imgd.ap7am.com/thumbnail/cr-20231119tn6559b30a34eff.jpg)
- మరికాసేపట్లో భారత్-ఆసీస్ మధ్య ప్రపంచకప్ ఫైనల్ సమరం
- ప్రపంచకప్ ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫొటో సెషన్
- అటలాజ్ స్టెపవెల్‌లో ఫొటోషూట్
మరికాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ ఫైనల్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా, ఆసీస్ సారథులు రోహిత్‌శర్మ, పాట్ కమిన్స్ ప్రపంచకప్ ట్రోఫీతో ప్రీమ్యాచ్ ఫొటోసెషన్‌లో పాల్గొన్నారు. గుజరాత్ గాంధీనగర్‌లోని చిన్న పట్టణమైన అడలాజ్ స్టెప్‌వెల్‌లో ఈ ఫొటో సెషన్ నిర్వహించారు. స్కిప్పర్లు ఇద్దరూ ట్రోఫీతో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోసెషన్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలను ఐసీసీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
![](https://img.ap7am.com/froala-uploads/20231119fr6559b2c77e316.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20231119fr6559b2d475fb8.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20231119fr6559b2e0e1d95.jpg)