Khushbu: మల్కాజిగిరిలో సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ప్రచారం

khushboo campaign in malkajgiri

  • శుక్రవారం మల్కాజిగిరిలోని పలు ప్రాంతాల్లో ఖుష్బూ ఎన్నికల ప్రచారం
  • బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఖుష్బూ
  • యాప్రాల్ చౌరస్తా నుంచి ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఖుష్బూ

ప్రముఖ సినీ నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ శుక్రవారం మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావుకు మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. యాప్రాల్ చౌరస్తా నుంచి ఆమె ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావును గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

గంగపుత్ర సంఘ సభ్యులతో రామచంద్ర రావు సమావేశం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు వినాయకనగర్ డివిజన్‌లోని కాకతీయనగర్ గంగపుత్ర సంఘం అసోసియేషన్ సభ్యులతో సమావేశంలో ఎన్ రామచంద్ర రావు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు సహకరించాలని ఆయన సంఘాన్ని కోరారు. మల్కాజ్‌గిరి అసెంబ్లీ పరిధిలోని వినాయకనగర్ డివిజన్‌లో గల వైపురి, వినోభానగర్ కాలనీలలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొని బీజేపీ గెలుపుకు సహకరించాలని, తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

Khushbu
ramachandra rao
BJP
Telangana Assembly Election
  • Loading...

More Telugu News