Rahul Gandhi: వరంగల్‌లో పాదయాత్రతో బహిరంగ సభకు వెళ్లిన రాహుల్ గాంధీ... ఇదిగో వీడియో

Rahul Gandhi padayatra in Warangal

  • తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ
  • రోడ్డుపై నడుస్తూ స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన కాంగ్రెస్ అగ్రనేత
  • వరంగల్ తూర్పులో కొండా సురేఖ తరఫున ఎన్నికల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్‍‌లో పాదయాత్ర నిర్వహించారు. వరంగల్‌లోని రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన పాదయాత్రగా సభా ప్రాంగణానికి వచ్చారు. రోడ్డుపై నడుస్తూ స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొండా సురేఖ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన దాదాపు ఒకటిన్నర కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు.

More Telugu News