Kathi Karthika: బీఆర్ఎస్ పార్టీలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక

Kathi Karthika joins BRS party

  • ఇటీవల కాంగ్రెస్ ను వీడిన కత్తి కార్తీక
  • మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక
  • కత్తి కార్తీకకు గులాబీ కండువా కప్పిన హరీశ్ రావు
  • గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసిన కత్తి కార్తీక

బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రేడియో జాకీ, యాంకర్ కత్తి కార్తీక బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కత్తి కార్తీక మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హరీశ్ రావు ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కత్తి కార్తీక గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అంతకుముందు ఆమె ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున దుబ్బాక ఉప ఎన్నికలోనూ పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కత్తి కార్తీక తాజాగా గులాబీ దళంలో చేరారు. గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు... కత్తి కార్తీకకు సూచించారు.

Kathi Karthika
BRS
Harish Rao
Congress
Assembly Election
Telangana
Bigg Boss
  • Loading...

More Telugu News