Nara Lokesh: గోరంట్ల బుచ్చయ్యచౌదరి పీఏపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేసి తల పగులగొట్టడం దారుణం: నారా లోకేశ్

Nara Lokesh comments on police

  • కొందరు పోలీసులు జగన్ ప్రైవేటు సైన్యంలా మారారన్న లోకేశ్
  • గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చంద్రశేఖర్ పై విచక్షణ రహితంగా దాడి జరిగిందని వెల్లడి
  • పోలీసులే దాడులకు పాల్పడితే ప్రజలకు దిక్కెవరంటూ ఆగ్రహం

రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా మారిపోయి ప్రతిపక్షాలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆందోళనకు గురిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.

రాజమండ్రి రామాలయం సెంటర్ లో  రోడ్డుపై కూర్చుని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ చంద్రశేఖర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ కుమార్ విచక్షణారహితంగా దాడిచేసి తల పగులగొట్టడం దారుణం అని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికారపార్టీ తొత్తులుగా మారి చట్టవిరుద్ధంగా ఇలా దాడులకు పాల్పడితే ప్రజలకు దిక్కెవరు? అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

"తమకు అన్యాయం జరిగినపుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ పౌరులకు కల్పించారు. అరాచక శక్తుల మాయలోపడి చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రశేఖర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆయనకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది" అని లోకేశ్ స్పష్టం చేశారు.

Nara Lokesh
Gorantla Butchaiah Chowdary
PA
Traffic Police
Attack
Rajahmundry
TDP
Jagan
YSRCP
  • Loading...

More Telugu News