Rahul Gandhi: ఉదయం నుంచి రాత్రి వరకు... రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల ప్రచారం

Rahul Gandhi and Kharge will campaign in telangana on 17
  • పినపాక, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పడమర, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో అగ్రనేతల ప్రచారం
  • ఉదయం గం.11 నుంచి రాత్రి వరకు కొనసాగనున్న రాహుల్ గాంధీ ప్రచారం 
  • రేపు తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మల్లికార్జున ఖర్గే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. వీరు రేపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు. పినపాక, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పడమర, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో వీరు పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ ప్రచారం ఉదయం గం.11 నుంచి రాత్రి వరకు కొనసాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పార్టీ అధ్యక్షుడు ఖర్గే శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారని, పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య టీపీసీసీ మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఆయన హైదరాబాద్‌లోనే బస చేస్తారని తెలిపారు.
Rahul Gandhi
Congress
Mallikarjun Kharge
Telangana Assembly Election

More Telugu News