Kajol: కలకలం రేపుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో

Kajol deepfake video went viral

  • ఆందోళన కలిగిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు
  • ఇటీవల రష్మిక మందన్న వీడియో వైరల్
  • తాజాగా కాజోల్ బట్టలు మార్చుకుంటున్నట్టుగా వీడియో

ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. మొన్న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. కాజోల్ బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలతో ఈ వీడియో ఉంది. టిక్ టాక్ స్టార్ రోజీ బీరీన్స్ ముఖం స్థానంలో కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఈ డీప్ ఫేక్ వీడియో రూపొందించినట్టు తెలుస్తోంది. ఎండాకాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలో చూపిస్తూ రోజీ బీరీన్స్ చేసిన వీడియోను కాజోల్ ముఖంతో మార్చివేశారు.

Kajol
Deepfake Video
Social Media
Bollywood
Rashmika Mandanna
  • Loading...

More Telugu News