Shivani Rajasekhar: అమ్మానాన్నలు జైలుకు వెళ్లలేదు .. మాతో హ్యాపీగా ఉన్నారు: శివాని రాజశేఖర్

Shivani Rajasekhar Interview

  • శివాని రాజశేఖర్ నుంచి 'కోట బొమ్మాళి పీఎస్'
  • కానిస్టేబుల్ గా కనిపిస్తానని శివాని వెల్లడి 
  • గతంలో వచ్చిన వార్తలపై ఇచ్చిన క్లారిటీ
  • తామంతా హ్యాపీగా ఉన్నామని వెల్లడి


శ్రీకాంత్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. రాహుల్ విజయ్ ... శివాని రాజశేఖర్ ప్రధానమైన పాత్రలుగా 'కోట బొమ్మాళి పీఎస్' సినిమా రూపొందింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో రాహుల్ విజయ్ - శివాని రాజశేఖర్ పాల్గొన్నారు. 

శివాని రాజశేఖర్ మాట్లాడుతూ .. "గతంలో మా ఫ్యామిలీ విషయంలో చాలా విషయాలు జరిగాయి. అమ్మానాన్నల అరెస్టు అంటూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా రాశారు .. దానితో ఏవోవో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఒకటి జరిగితే ఇంకొకటి బయటికి వచ్చింది. అమ్మానాన్నలు జైలుకి వెళ్లలేదు .. ఇంట్లో హ్యాపీగా ఉన్నారు" అని చెప్పింది. 

"అమ్మానాన్నలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్లు ఎంత జన్యూన్ అనే విషయం .. ఎప్పుడు ఎందుకు ఎలాంటి పరిస్థితులను వాళ్లు ఫేస్ చేశారనేది మాకు మాత్రమే తెలుసు. రకరకాల రూమర్స్ వస్తుంటాయి .. పోతుంటాయి. మా పనిని మేము సిన్సియర్ గా చేస్తూ ముందుకు వెళుతున్నాము" అంటూ సమాధానమిచ్చింది. 

Shivani Rajasekhar
Rahul Vijay
Kota Bommali PS
  • Loading...

More Telugu News