Mangalavaram: 'మంగళవారం' మేకింగ్ వీడియో రిలీజ్ .. చూసేయండి!

Mangalavaram Making Video

  • రేపు విడుదలవుతున్న 'మంగళవారం'
  • మిస్టీరియస్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • నెక్స్ట్ లెవెల్ మేకింగ్ చూస్తారన్న డైరెక్టర్
  • రిస్కీ షాట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని వెల్లడి


ఈ శుక్రవారం థియేటర్లకు వస్తున్న సినిమాల్లో 'మంగళవారం' సినిమాకి ఎక్కువ బజ్ కనిపిస్తోంది. గోదావరి తీర ప్రాంతం .. గ్రామీణ నేపథ్యం .. ఆ విలేజ్ లోని వివిధ చీకటి కోణాలు ఈ కథలోని అంశాలుగా కనిపించనున్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు కనిపిస్తున్నాయి. 

ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకింగ్ వీడియోను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. మిస్టీరియస్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుందనీ, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక సినిమా రాలేదని అజయ్ భూపతి చెప్పాడు. నైట్ షూట్స్ .. రిస్కీ షాట్స్ కోసం చాలా కష్టపడ్డామని ఆయన అన్నాడు. 

"గోదావరి నేపథ్యంలో .. పొంగుతున్న వాగు నేపథ్యంలో .. మంటలు చెలరేగుతున్న పొలాలకు సంబంధించిన షాట్స్ ను, నెక్స్ట్ లెవెల్ మేకింగ్ ఆడియన్స్ కి చూపించాలనే ఉద్దేశంతో చేశామని అజయ్ భూపతి అన్నాడు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుందని ఆయన చెప్పాడు. 

More Telugu News