Surya: 'కంగువా'లో కట్టిపడేసే ఆరు ఫైట్లు!

Kanguva Movie Update

  • సూర్య హీరోగా రూపొందుతున్న 'కంగువా'
  • 300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా 
  • చెన్నైలో జరుగుతున్న షూటింగు
  • వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు  


సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'కంగువా' సినిమా రూపొందుతోంది. స్టూడియో గ్రీన్ - యూవీ క్రియేషన్స్ వారు కలిసి 300 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2D - 3D ఫార్మెట్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. 

ఈ సినిమాలో మొత్తం ఆరు ఫైట్స్ ఉంటాయట. ప్రతి ఫైట్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయించారని అంటున్నారు. అండర్ వాటర్ లో .. ఫారెస్టులో .. బీచ్ లో .. బోట్ లో .. ఫ్లైట్ లో .. జిమ్ లో డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 

సూర్య జోడీగా దిశా పటాని అలరించనుంది. బాబీ డియోల్ .. జగపతిబాబు ... యోగిబాబు .. ఆనంద్ రాజ్ .. కోవై సరళ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను 6 భాషల్లో విడుదల చేయనున్నారు. సూర్య కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలవడం ఖాయమనే నమ్మకంతో ఆయన అభిమానులు ఉన్నారు.

Surya
Disha Pathani
Jagapathi Babu
Kanguva
  • Loading...

More Telugu News