Somireddy Chandra Mohan Reddy: జగన్ క్షుద్ర రాజకీయానికి వైఎస్‌ఆర్ ఆత్మ కూడా క్షోభిస్తుంది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Somireddy Chandramohan reddy lashes out at Jagan Reddy

  • ప్రవీణ్, బీటెక్ రవిల అరెస్టులు జగన్ పిరికితనానికి అద్దంపడుతున్నాయన్న సోమిరెడ్డి
  • వైఎస్‌ఆర్ ప్రతిపక్షాలను తప్పుడు కేసులతో వేధించలేదని వ్యాఖ్య
  • పులివెందుల ప్రజల్లోనూ జగన్‌పై వ్యతిరేకత ఉందని వెల్లడి

జగన్ అక్రమ కేసులతో చేస్తున్న క్షుద్ర రాజకీయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా క్షోభిస్తుందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత నీచమైన రాజకీయాలు ఎవరూ చేయలేదని చెప్పారు. రోజుకో అరెస్టుతో జగన్ రెడ్డి చరిత్ర హీనుడిగా ముగిసిపోతాడని స్పష్టం చేశారు. ‘‘రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు... ప్రతి పక్షాలతో రాజకీయంగానే పోరాడారు తప్ప తప్పుడు కేసులతో వేధించలేదు. నేడు పులివెందుల ప్రజల్లో కూడా జగన్ రెడ్డిపై వ్యతిరేకత మొదలైంది. కడప జిల్లాలో టీడీపీ ఇంచార్జులు ప్రవీణ్, బీటెక్ రవి అరెస్టులు జగన్ పిరికితనానికి అద్దంపడుతున్నాయి’’ అంటూ విమర్శలు గుప్పించారు.

Somireddy Chandra Mohan Reddy
Telugudesam
YS Jagan
YSRCP
  • Loading...

More Telugu News