Shivaji: బిగ్ బాస్ హౌస్ లో అరుపులు .. కేకలతో జరిగిన నామినేషన్స్!

Bigg Boss 7 Update

  • బిగ్ బాస్ హౌస్ లో 71వ రోజు నామినేషన్స్ 
  • హౌస్ మేట్స్ మధ్య ఆవేశాలు .. వాదనలు
  • అర్జున్ - ప్రశాంత్ మధ్య మాటల తూటాలు 
  • అమర్ - యావర్ మధ్య ముదిరిన గొడవ


71వ రోజున బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ రచ్చ ఒక రేంజ్ లో జరిగింది. శోభ కెప్టెన్ గా ఉన్నప్పటి ఆమె నిర్ణయాలు తనకి నచ్చలేదని రతిక ఆమెను నామినేట్ చేసింది. అలాగే ప్రియాంకను కూడా నామినేట్ చేసింది. ఈ ముగ్గురి మధ్య చాలా సేపు వాదన జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే శోభా -  ప్రియాంకపై రతిక విరుచుకుపడింది.

ఇక ఆ తరువాత  సొంత అభిప్రాయం .. సొంత ఆటతీరు లేదంటూ ప్రశాంత్ ను అర్జున్ నామినేట్ చేశాడు. శివాజీతో ప్రశాంత్ సాన్నిహిత్యంగా ఉండటం గురించి ప్రస్తావించాడు. దాంతో ప్రశాంత్ తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు. తేనె పూసిన కత్తిలా మాట్లాడవద్దని అర్జున్ ను హెచ్చరించాడు. ఎలా ఆడాలో తనకి చెప్పవలసిన అవసరం లేదని సమాధానమిచ్చాడు. 

ఇక యావర్ కీ ... అమర్ కి మధ్య గొడవ పతాక స్థాయికి చేరుకుంది. గడిచిపోయిన వారాల విషయాలను తీసుకొచ్చి తనని నామినేట్ చేయడం కరెక్టు కాదని యావర్ తో అమర్ వాదించాడు. తన ఛాన్స్ రాగానే యావర్ ను నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్యకి శివాజీ వెళ్లి దూరంగా జరపవలసి వచ్చింది. ఈ వారం నామినేట్ అయినవారిలో శోభ .. ప్రియాంక .. అమర్ ముందువరుసలో ఉన్నారు.

Shivaji
Amar
Yavar
Arjun
Prashanth
  • Loading...

More Telugu News