Apurva: హాట్ స్టార్ లోకి అడుగుపెట్టిన 'అపూర్వ'

Apurva Movie Update

  • హాట్ స్టార్ లో మొదలైన 'అపూర్వ' స్ట్రీమింగ్ 
  • టైటిల్ రోల్ ను పోషించిన తార సుతారియా
  • ఆమె నటనే ఈ సినిమాకి హైలైట్ 
  • కీలక పాత్రలను పోషించిన రాజ్ పల్ యాదవ్ - అభిషేక్ బెనర్జీ 


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రోజు నుంచి 'అపూర్వ' సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తారా సుతారియా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రాజ్ పల్ యాదవ్ .. అభిషేక్ బెనర్జీ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వం వహించాడు. 

'చంబల్' లో ఒక గ్యాంగ్ సుపారీ తీసుకుని హత్యలు చేస్తూ ఉంటుంది. అలా వాళ్లు ఒక మర్డర్ చేసి వెళుతుండగా ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన కారణంగానే 'అపూర్వ' ఆ గ్యాంగ్ చేతికి చిక్కుతుంది. ఆమెను అనుభవించాలనే కోరికతో కిడ్నాప్ చేస్తారు. 

ఆ హంతకుల బారి నుంచి తప్పించుకోవడానికి అపూర్వ ఏం చేస్తుంది? అందుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఎలాంటివి? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు. ఫొటోగ్రఫీ పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, త్వరలో మిగతా భాషల్లోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Apurva
Tara Sutaria
Abhishek Benarji
Rajpal Yadav

More Telugu News