Sai Dharam Tej: అభిమానిపై మండిపడ్డ సాయిధరమ్ తేజ్

Sai Dharam Tej fires on netizen

  • అభిమానులతో చిట్ చాట్ చేసిన సాయి ధరమ్ తేజ్
  • రిపబ్లిక్ స్పెల్లింగ్ రిలబ్లిక్ గా టైప్ చేసిన తేజూ
  • ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా అని ప్రశ్నించిన అభిమాని

మెగా హీరో సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. పలు సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న తేజ్... ప్రస్తుతం 'గాంజా శంకర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు పలు సినిమాలను ట్రాక్ లో పెట్టాడు. మరోవైపు తన అభిమానులతో తాజాగా చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక నెటిజెన్.. మీ సినిమాలలో మీకు చాలా సంతృప్తిని ఇచ్చిన పాత్రలు ఏమిటని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా చిత్రలహరి, రిపబ్లిక్ సినిమాల్లోని పాత్రలు తనకు చాలా సంతృప్తిని ఇచ్చాయని చెప్పాడు. 

అయితే రిపబ్లిక్ స్పెల్లింగ్ రిలబ్లిక్ అని తప్పుగా పడటంతో... మరో నెటిజెన్ సెటైరిక్ గా స్పందించాడు. అది రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్... ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా? అని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై తేజ్ స్పందిస్తూ... తమ స్కూల్లో తమకు గౌరవం కూడా నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించారా? అని ప్రశ్నించాడు. నేర్పించకపోతే నేర్చుకో అని ఘాటుగా బదులిచ్చాడు. దీనికి సదరు నెటిజెన్ స్పందిస్తూ... నన్ను క్షమించు అన్నా... నీవు రిప్లై ఇవ్వవనే అలా పెట్టాను అని బదులిచ్చాడు.

Sai Dharam Tej
Tollywood

More Telugu News