Sobhan Babu: జయలలితతో శోభన్ బాబుకి అదే ఫస్టు మూవీ .. ఆయన చాలా టెన్షన్ పడ్డారు: తమ్మారెడ్డి భరద్వాజ

Thammareddy  Bharadwaja Interview

  • 50 ఏళ్లను పూర్తిచేసుకున్న 'డాక్టర్ బాబు'
  • శోభన్ బాబు - జయలలిత కాంబోలో వచ్చిన సినిమా 
  • అప్పటికే జయలలిత స్టార్ హీరోయిన్ 
  • ఆ షూటింగుకు వస్తూ శోభన్ భయపడ్డారన్న తమ్మారెడ్డి   


తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన 'డాక్టర్ బాబు' 1973 .. నవంబర్ 9వ తేదీన విడుదలైంది. శోభన్ బాబు - జయలలిత కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. ఈ సినిమా 50 ఏళ్లను పూర్తిచేసుకున్న కారణంగా తమ్మారెడ్డి భరద్వాజ ఆ సినిమాను గురించిన విశేషాలను పంచుకున్నారు. 

"అప్పట్లో ఈ సినిమా తీయమని మా నాన్నగారికి చెప్పింది నేనే. కానీ ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. అందువలన సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందులను చూసింది. ఆ సినిమా షూటింగు మొదటి రోజున జయలలిత వచ్చారు. రెండో రోజున శోభన్ బాబు జాయిన్ అయ్యారు. ఆయనను కోయంబత్తూరు నుంచి నేనే కార్లో షూటింగుకి తీసుకుని వచ్చాను. 

"కారులో వస్తుండగా శోభన్ బాబు గారు జయలలిత గురించి ప్రస్తావించారు. అప్పటికే ఆమెను గురించి రకరకాలుగా విని ఉండటం వలన ఆయన చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ .. శోభన్ బాబు అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరో. ఆమెతో ఎలా యాక్ట్ చేయాలో ఏంటో అనుకుంటూ భయం భయంగానే వచ్చారు" అని చెప్పారు.

Sobhan Babu
Jayalalitha
Doctor Babu Movie
  • Loading...

More Telugu News