Shabbir Ali: 'కాంగ్రెస్ ముఖ్యమంత్రి' ఎవరన్న విషయంపై షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు

Shabbir Ali comments on chief minister on Kamareddy

  • కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న షబ్బీర్ అలీ
  • షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి ఎక్కడికీ పోలేదని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్న షబ్బీర్ అలీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో... మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ తేల్చి చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రోడ్డు షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ... షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి ఎక్కడికీ పోలేదని, మీ గుండెల్లోనే ఉన్నాడన్నారు. ఇక్కడి నుంచి తనకు బదులు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో రేవంత్ కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో కూడా బరిలో నిలిచారు. 

Shabbir Ali
Revanth Reddy
Congress
Telangana Assembly Election
  • Loading...

More Telugu News