renuka choudhary: పిచ్చి వెధవలు... మీరొచ్చి రైడ్ చేస్తే దొరకడానికి డబ్బులు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా?: ఐటీ అధికారులపై రేణుకా చౌదరి

Renuka Choudhary fires at it officers

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆగ్రహం
  • కాంగ్రెస్ పార్టీకి ఐటీ దాడులు అలవాటుగా మారాయన్న రేణుకా చౌదరి
  • ఎర్రి బాగుల వెధవలు మమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశారన్న కేంద్ర మాజీ మంత్రి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారికి ఐటీ దాడులు అలవాటుగా మారిందన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.... 'అంత పిచ్చి వెధవలు కాకపోతే మేం ఇళ్లల్లో డబ్బులు పెట్టుకొని కూర్చుంటామా... మీరొచ్చి రైడ్ చేస్తే మీకు దొరకడానికి... ఏ ఎర్రిబాగుల వెధవలు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశారు. ఏం పర్వాలేదు' అని రేణుకా చౌదరి అన్నారు.

మా ఇళ్లలో డబ్బులు ఉన్నాయని వారు చెబుతున్నారని, కానీ మీ పోలీస్ వాహనాలలో డబ్బులు ఎక్కడకు వెళ్తున్నాయి? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు జరుగుతుంటాయని ఆరోపించారు. ఇది అలవాటుగా మారిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాము పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని, మూడు నెలల తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుస్తామన్నారు. తాము ఉచిత పవర్ ఇస్తున్నామని, కాబట్టి వాళ్ల పవర్ కట్ అవుతుందని చెప్పారు.

renuka choudhary
Congress
Khammam District
Telangana Assembly Election
  • Loading...

More Telugu News