Mangalavaram: ఆ సినిమాతో 'మంగళవారం' సినిమాకి ఎలాంటి పోలిక ఉండదు: డైరెక్టర్ అజయ్ భూపతి

Ajay Bhupathi Interview

  • ఈ నెల 17న విడుదలవుతున్న 'మంగళవారం'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అజయ్ భూపతి
  • 'అన్వేషణ' కథకి ఈ సినిమా దగ్గరగా ఉందనే టాక్
  • అందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పిన డైరెక్టర్


అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ ప్రధానమైన పాత్రగా  'మంగళవారం' సినిమా రూపొందింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ వదిలిన తరువాత 'అన్వేషణ' సినిమాకి దగ్గరగా ఉందనే టాక్ వినిపించింది. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో అజయ్ భూపతి స్పందించాడు. 

'అన్వేషణ' సినిమాకి .. 'మంగళవారం' సినిమాకి ఎక్కడా ఎలాంటి పోలిక ఉండదు. గతంలో చాలా థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. కానీ 'మంగళవారం' మిస్టీరియస్ థ్రిల్లర్. ఈ సినిమా జర్నీనే డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది .. ఎమోషన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి" అన్నాడు. 

'RX 100' సినిమాలో ఎమోషన్స్ తో పోల్చుకుంటే రొమాన్స్ చాలా తక్కువ. అలాగే 'మహా సముద్రం'లోను ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అదే విధంగా ఈ సినిమాలోను ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఇది ఒక కాన్ టెంపరరీ పాయింట్ .. 'అన్వేషణకి దీనికి సంబంధమే లేదు" అని చెప్పాడు.


Mangalavaram
Ajay Bhupathi
Payal
  • Loading...

More Telugu News