Allu Arjun: చిల్ట్రెన్స్ డే సందర్భంగా క్యూట్ ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun shares family pic on Childrens Day

  • చిల్డ్రెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన బన్నీ
  • ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాలో బిజీగా ఉన్న అల్లు అర్జున్
  • బన్నీ సరసన నటిస్తున్న రష్మిక మందన్న

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఒక కంప్లీట్ ఫ్యామిలీ మెన్ గా చెప్పుకోవచ్చు. షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ... తన కుటుంబానికి బన్నీ వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించేందుకు ప్రయత్నిస్తుంటాడు. బన్నీ కానీ, ఆయన భార్య స్నేహ కానీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోల్లో ఫ్యామిలీ పిక్స్, వారి పిల్లల ఫొటోలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా చిల్డ్రెన్స్ డే సందర్భంగా భార్య, పిల్లలతో ఉన్న పిక్ ను బన్నీ షేర్ చేశారు. హ్యాపీ చిల్డ్రెన్స్ డే అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సినిమాల విషయానికి వస్తే... అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 'పుష్ప 1'కి మించి హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

More Telugu News