Mangalavaram: నేను ఇండస్ట్రీలో ఇమడలేను: డైరెక్టర్ అజయ్ భూపతి  

Ajay Bhupathi Interview

  • అజయ్ భూపతి రూపొందించిన 'మంగళవారం'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  • తనలో విలేజ్ పోకడలు ఎక్కువన్న డైరెక్టర్ 
  • చొచ్చుకునిపోయే స్వభావం కాదని వెల్లడి  


అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. పాయల్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా 'గ్రేట్ ఆంద్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ భూపతి మాట్లాడుతూ, ఈ సినిమా గురించిన విషయాలను పంచుకున్నాడు. 

"నాకు కోపం ఎక్కువని అంటూ ఉంటారు గానీ .. నిజానికి నాకు కోపమే ఉండదు. నేను నెమ్మదిగా మాట్లాడినా అది కాస్త గట్టిగానే వినిపిస్తుంది. ఏది చెప్పినా కొంచెం స్ట్రాంగ్ గా చెబుతాను. అందువలన నా గురించి అలా అనుకుంటూ ఉండొచ్చు.  నాలో విలేజ్ పోకడలే ఎక్కువగా కనిపిస్తాయి. అవి పోకూడదనే కోరుకుంటున్నాను" అని అన్నాడు. 

"నేను ఇండస్ట్రీలో ఉంటున్నానుగదా అని చెప్పి ఇక్కడలా ఉండలేను. నిజం చెప్పాలంటే నేను ఇండస్ట్రీలో ఇమడలేను. నా అంతట నేనుగా అందరిలోకి చొచ్చుకుని వెళ్లలేను. పాత ఫ్రెండ్స్ నాతో ఉంటారు .. కొత్తగా ఫ్రెండ్స్ అయినవాళ్లలో శర్వా .. సిద్ధార్థ్ కనిపిస్తారంతే. ఇక 'మంగళవారం' సినిమా గ్రామీణ జీవితంలోని కొన్ని చీకటి కోణాలను ఆవిష్కరిస్తుంది" అని చెప్పాడు. 

Mangalavaram
Ajay Bhupathi
payal
  • Loading...

More Telugu News