mega family: లావణ్య, వరుణ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్.. ఫొటోలు ఇవిగో!

Varun Tej Lavanya Tripathis latest photoshoot pics

  • ఎరుపు రంగు లెహంగాలో మెరిసిన ‘అందాల రాక్షసి’
  • బ్లాక్ కలర్ కుర్తా పైజామాలో దీటుగా వరుణ్
  • ఇన్ స్టాలో వైరల్ గా మారిన కొత్త జంట ఫొటోలు

మెగా వారి ఇంట కొత్త జంట లావణ్య, వరుణ్ ల సందడి మామూలుగా లేదు.. దీపావళి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ జంట తాజాగా పోస్ట్ వెడ్డింగ్ షూట్ కు పోజులిచ్చింది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ తర్వాత లావణ్య, వరుణ్ నేరుగా ఇండియాకు వచ్చేశారు. ఆ తర్వాత పెళ్లి విందు, నిహారిక సినిమా ఓపెనింగ్‌, ఆపై దీపావళి వేడుకలతో బిజీబిజీగా గడిపారు. తాజాగా పోస్ట్ వెడ్డింగ్ ఫొటో షూట్ చేశారు.

దీనికోసం రెడ్‌ లెహంగా చోళీలో లావణ్య, బ్లాక్‌ కుర్తాలో వరుణ్‌ తేజ్‌ మెరిశారు. రొమాంటిక్ పోజులతో పర్‌ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. ఈ ఫొటోలను తమ అభిమానుల కోసం ఇన్ స్టాలో షేర్ చేశారు. దీంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. కొత్తజంట చూడముచ్చటగా ఉందని మెచ్చుకుంటున్నారు. దీపావళి విషెస్ చెబుతూ దిష్టి తీసుకోమంటూ కామెంట్లు పెడుతున్నారు.





mega family
lavanya varun
post wedding shoot
Instagram
Viral Pics
  • Loading...

More Telugu News