Harish Rao: కేటీఆర్‌ను సీఎం చేసినా నాకు ఓకే: హరీశ్ రావు

Harish Rao responds over possibility of KTR being made CM
  • కాంగ్రెస్‌ పార్టీలా బీఆర్ఎస్‌లో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవన్న హరీశ్
  • పదవులు, అధికారం కావాలని ఏనాడూ కోరుకోలేదని వ్యాఖ్య
  • కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ
  • కాళేశ్వరంపై కాంగ్రెస్‌ అవగాహన లేకుండా మాట్లాడుతోందని మండిపాటు
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తన దృష్టిలో పదవులకంటే వ్యక్తిత్వమే గొప్పదని చెప్పారు. కేటీఆర్ తనకు చాలా మంచి స్నేహితుడన్న హరీశ్, ఆయనను ముఖ్యమంత్రిగా చేస్తే అంగీకరిస్తానని చెప్పారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలను కూడా హరీశ్ తిప్పికొట్టారు. ప్రాజెక్టుపై ఏమాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘కాళేశ్వరంపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం వచ్చాక రెండు పంటలు వేస్తున్నది నిజం కాదా? మంచి పేరు వచ్చిందనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారు. మంచి పేరు పోగొట్టాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు. విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో వారు కమీషన్లు తీసుకున్నారా?’’ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన రాహుల్ గాంధీ జోకర్ అయిపోయారని కామెంట్ చేశారు.
Harish Rao
KTR
BRS
Congress
Rahul Gandhi

More Telugu News