Bhupesh Singh Baghel: ప్రజల కోసం కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్ గఢ్ సీఎం... వీడియో ఇదిగో!

Chhattisgarh CM Baghel attends Gowara Gowri Pooja

  • దీపావళి వేళ ఛత్తీస్ గఢ్ లో గౌరా గౌరీ పూజ
  • అమ్మవారి పూజలో భాగంగా కొరడా దెబ్బలు
  • ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకున్నానన్న సీఎం బఘేల్

దీపావళి వేళ ఛత్తీస్ గఢ్ లో గౌరా గౌరీ మాతను పూజించడాన్ని అక్కడి ప్రజలు అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. అంతేకాదు, గౌరా గౌరీ పూజ నిర్వహించి, కొరడా దెబ్బలు తింటారు. తాజాగా, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బఘేల్ కూడా గౌరీ మాత పూజలో పాల్గొన్నారు. 

దుర్గ్ జిల్లాలోని జంజ్గీర్ గ్రామంలో జరిగిన గౌరా గౌరీ పూజకు హాజరైన సీఎం బఘేల్ ఎంతో భక్తిప్రపత్తులతో అమ్మవారిని పూజించారు. సంప్రదాయాన్ని అనుసరించి చేతిపై కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కొరడా దెబ్బలు తిన్నానని వెల్లడించారు. 

ఈ పండుగ అందరూ సమానమేనని చాటుతుందని, అమ్మవారి ముందు అందరూ ఒక్కటేనని అన్నారు. ఇది సర్వ మానవ సమానత్వాన్ని సూచించే పండుగ అని సీఎం బఘేల్ వివరించారు.

More Telugu News