Rajinikanth: దీపావళి సందర్భంగా మనవళ్లకు కానుకలు ఇచ్చిన రజనీకాంత్

Rajinikanth celebrates Diwali with grandsons

  • రజనీ ఇంట ఘనంగా దీపావళి
  • మనవళ్లు యాత్ర, లింగాలతో కలిసి వేడుకలు జరుపుకున్న 'తలైవర్'
  • నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు

దక్షిణాది సూపర్ స్టార్, 'తలైవర్' రజనీకాంత్ తన ఇంట ఘనంగా దీపావళి జరుపుకున్నారు. ఈసారి మనవళ్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ లకు యాత్ర, లింగా అనే కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, తన నివాసంలో యాత్ర, లింగాలతో కలిసి రజనీ దీపావళి హంగామా సృష్టించారు. పండుగ సందర్భంగా మనవళ్లకు కానుకలు ఇచ్చారు. యాత్ర, లింగా ఈ సందర్భంగా తాతయ్య రజనీకాంత్ కాళ్లకు మొక్కారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

రజనీకాంత్ ప్రస్తుతం కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలామ్' చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో 'మొయిద్దీన్ భాయ్' అనే పవర్ ఫుల్ పాత్రలో రజనీ నటిస్తున్నారు.

More Telugu News