Jana Reddy: ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ... జానారెడ్డి నామినేషన్ తిరస్కరణ

Janareddy nomination rejected

  • నాగార్జున సాగర్ నుంచి నామమాత్రంగా నామినేషన్ వేసిన జానారెడ్డి
  • తెలంగాణ వ్యాప్తంగా పలువురి నామినేషన్ల తిరస్కరణ
  • కొల్లాపూర్ నుంచి మూడు నామినేషన్ల తిరస్కరణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. పలువురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఇందులో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇక్కడి నుంచి ఆయన తనయుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. 

ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా పలువురి నామినేషన్లు తిరస్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నామినేషన్లు, కరీంనగర్ మానకొండూరులో ఏడు నామినేషన్లు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మూడు నామినేషన్లను తిరస్కరించారు. కొల్లాపూర్ నుంచి 21 మంది నామినేషన్లు దాఖలు చేయగా 18 మందివి ఆమోదం పొందాయి. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో మిగిలిన మూడింటిని తిరస్కరించారు.

Jana Reddy
State Election Commission
Telangana Assembly Election
  • Loading...

More Telugu News