Rahul Gandhi: తెలంగాణ ఎన్నికలు... 17న ఒకేరోజు మూడు సభల్లో పాల్గొననున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi to participate three public meetings on 17

  • పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలకు రాహుల్ గాంధీ
  • తెలంగాణలో మొత్తం ఆరు రోజుల పాటు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం
  • త్వరలో రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల పర్యటనలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ తెలంగాణలో వివిధ తేదీలలో మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వెల్లడించింది.

ఒకేరోజు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనల తేదీలను పార్టీ ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీల అగ్రనేతల పర్యటనలు ఉండేలా చూస్తున్నారు.

Rahul Gandhi
Telangana
Telangana Assembly Election
Congress
  • Loading...

More Telugu News