Virat Kohli: ఇలా చేస్తే ఎలా అనుష్కా?.. మైదానంలో నిలబడి భార్యకు కోహ్లీ సైగలు!

Kohli questions wife anushka over not clapping for him

  • నిన్న నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అభిమానుల కోరిక మేరకు కోహ్లీ బౌలింగ్
  • తొలిసారిగా బౌలింగ్ చేస్తున్నా చప్పట్లు కొట్టని భార్య అనుష్క
  • ‘చప్పట్లు కొట్టకపోతే ఎలా అనుష్కా..?’ అంటూ కోహ్లీ సైగలు
  • నెట్టింట వీడియో వైరల్

ఈ వరల్డ్ కప్‌లో సరికొత్త రికార్డులు సృష్టించిన కింగ్ కోహ్లీ నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గాను తన సత్తా చాటాడు. ఓ వికెట్ తీసి అభిమానులను మురిపించాడు. భారత్‌కు అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారైపోవడంతో నిన్నటి మ్యాచ్‌ ఉత్సాహభరితంగా సాగింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఛాన్సు ఇవ్వాలంటూ స్టాండ్స్‌ నుంచి అభిమానులు గట్టిగా అరిచారు. దీంతో, కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్‌కు బంతి అందించాడు. 

23వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన విరాట్ తొలి ఓవర్‌లో ఏడు పరుగులు ఇచ్చాడు. అయితే, గ్యాలరీలో ఉన్న విరాట్ అర్ధాంగి అనుష్క శర్మ చిరునవ్వులు చిందించడం మినహా చప్పట్లు కొట్టలేదు. ఇది గమనించిన విరాట్ సరదాగా స్పందించాడు. ‘చప్పట్లు కొట్టకపోతే ఎలా అనుష్కా?’ అంటూ  సైగలు చేశాడు. 

కాగా, 25వ ఓవర్‌లో మూడో బంతికి స్టాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసిన కోహ్లీ అభిమానులను ఉర్రూతలూగించాడు. స్టేడియంలో సంబరం అంబరాన్నంటేలా చేశాడు. కోహ్లీ వికెట్ తీయడం చూసి అనుష్క కూడా మురిసిపోయింది. సీటులోంచి లేచి మరీ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Virat Kohli
Anushka Sharma
Cricket

More Telugu News