Bigg Boss: తేజను శత్రువుగా భావించడం లేదు: 'బిగ్ బాస్' సందీప్ మాస్టర్

Sundeep Interview

  • తేజ కారణంగా బయటికి వచ్చానన్న సందీప్ 
  • తాను వెళ్లిపోతానని అతను ఊహించలేదని వెల్లడి 
  • తేజను ట్రోల్ చేయడం కరెక్టు కాదని వ్యాఖ్య 
  • అందుకే సన్నబడ్డానని వివరణ


బిగ్ బాస్ హౌస్ నుంచి తేజ కారణంగా బయటికి వచ్చినవాళ్లలో సందీప్ ఒకరు. సందీప్ బయటికి రావడానికి ముందు ఆయనకి యావర్ తో నడిచిన వాదన గురించి తెలిసిందే. బయటికి వచ్చిన తరువాత సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఐదు వారాలు ఇమ్యూనిటీతో ఉండటం వలన, నేను నామినేషన్స్ లో లేను. 8వ వారంలో తేజ నామినేట్ చేయడం వలన బయటికి రావలసి వచ్చింది. అయితే అందుకు తేజపై నాకు కోపం లేదు ... అతణ్ణి నా శత్రువుగా భావించడం లేదు. తనతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది" అని అన్నాడు. 

తేజ తన నామినేషన్ కారణంగా నేను బయటికి వెళ్లిపోతానని ఊహించలేదు. అందువలన నేను బయటికి వెళ్లిపోయిన తరువాత చాలా ఏడ్చాడు. ఈ విషయంలో తేజను చాలామంది ట్రోల్ చేశారు .. నాకే పాపం అనిపించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ చాలా లిమిటెడ్ గా ఇస్తారు. అందువల్లనే నేను సన్నబడ్డాను" అని చెప్పాడు. 

Bigg Boss
Sundeep
Teja
  • Loading...

More Telugu News