Morning Walk: రోజుకు ఈ మాత్రం నడిస్తే చాలు.. మధుమేహం, గుండెజబ్బుల నుంచి రక్షణ

Spain university says 8 thousand steps enough for health
  • రోజుకు 10 వేల అడుగులు నడవాలన్న గత అధ్యయనాలు
  • అంత అవసరం లేదన్న స్పెయిన్‌ యూనివర్సిటీ
  • రోజుకు మధ్యస్తంగా 8 వేల అడుగులు నడిస్తే చాలని స్పష్టీకరణ
  • అంటే రోజుకు 6.4 కిలోమీటర్లు నడిస్తే మరణాన్ని వాయిదా వేయవచ్చన్న పరిశోధకులు
రోజుకు ఎన్నివేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు?.. మధుమేహం, గుండెజబ్బులు వంటి వాటి నుంచి రక్షణ పొందొచ్చు? ఈ ప్రశ్నకు తాజాగా మరో సమాధానం దొరికింది. రోజుకు కనీసం 10 వేల అడుగులైనా వేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని గత అధ్యయనాలు చెబుతూ వచ్చాయి. అయితే, అంత అవసరం లేదని, రోజుకు కనీసం 7 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే మరణాన్ని వాయిదా వేయొచ్చని స్పెయిన్‌లోని గ్రనాడా యూనివర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. 6.4 కిలోమీటర్లు నడిచినా ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు. 

10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటామన్న ఉద్దేశంతో కొందరు ఆ నంబరును చేరుకునేందుకు కష్టపడుతున్నారని, అధికబరువు ఉన్న వారికి దీనివల్ల ఇబ్బంది పడడంతోపాటు వారి గుండెపై మరింత ఒత్తిడి పడుతుందని పేర్కొన్నారు. కాబట్టి రోజుకు 2,500 నుంచి 3 వేల అడుగులతో మొదలుపెట్టి క్రమంగా ప్రతి 15 రోజులకు 500 అడుగులు పెంచుకుంటూ పోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. అధిక బరువు ఉన్నవారు తొలుత 1000 అడుగులతో మొదలుపెట్టినా సరిపోతుందని పేర్కొన్నారు. ఇక, వృద్ధులైతే మాత్రం తమ శక్తిమేరకు లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం మేలని వివరించారు.
Morning Walk
Granada University
Spain
Sugar
Heart Diseases

More Telugu News