Jharkhand: గంటకు 130 కీలోమీటర్ల వేగంతో రైలు! అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఇద్దరి మృతి

two passengers dead after train stops suddenly

  • ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో శనివారం ఘటన
  • పూరీ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
  • రైలును ఆపేందుకు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ప్రమాదం

గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఓ రైల్లో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఇద్దరు ప్రయాణికులు భారీ కుదుపులకు లోనై మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. పర్సాబాద్ సమీపంలో పూరి నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఇది గుర్తించిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో, అత్యధిక వేగంతో వెళుతున్న రైలు అకస్మాత్తుగా నిలిపోయింది. 

ఈ క్రమంలో భారీ కుదుపునకు లోనై ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, నాలుగు గంటల తర్వాత రైలును మరో ఇంజిన్‌ సాయంతో గోమా రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ బోగీలకు మరో ఎలక్ట్రిక్ ఇంజన్ జత చేసి గమ్యస్థానానికి పంపించారు.

Jharkhand
Indian Railways
  • Loading...

More Telugu News