Liquor Lorry: విశాఖలో మద్యం లారీ బోల్తా... ఇక చెప్పేదేముంది...!

Liqour load lorry overturn in Vizag

  • మధురవాడలో అదుపుతప్పి బోల్తా పడిన లారీ
  • రోడ్డుపై పడిపోయిన మద్యం బాటిళ్లు
  • అందినకాడికి పట్టుకెళ్లిన స్థానికులు, దారిన పోయేవాళ్లు

మద్యం లోడుతో వెళుతున్న లారీలు ఎక్కడైనా బోల్తా పడితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్థానికులు, దారిన పోయేవాళ్లు చేతికందిన బాటిళ్లు ఎత్తుకుని వెళ్లడం సర్వసాధారణం. ఇవాళ విశాఖలో కూడా అదే జరిగింది. నగరంలోని మధురవాడలో మద్యం లారీ రోడ్డుపై అదుపుతప్పి బోల్తాపడింది. దాంతో మద్యం బాటిళ్లు రోడ్డుపై పడిపోయాయి. 

ఇంకేముంది... ఆ సమాచారం కొద్దిసేపట్లోనే పాకిపోయింది. జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మద్యం సీసాలు పట్టుకెళ్లారు. ఒక్కొక్కరు మూడ్నాలుగు సీసాలు ఎత్తుకెళ్లడం కనిపించింది. కొంతసేపు ఆ ప్రాంతమంతా అరుపులు, కేకలతో  హోరెత్తిపోయింది. 

ఈ వ్యవహారం అంతా మీడియా కెమెరాల దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Liquor Lorry
Overturn
Madhuravada
Vizag

More Telugu News