Payal: అల్లు అర్జున్ లాంటి నటుడిని నేను చూడలేదు: 'మంగళవారం' ప్రీ రిలీజ్ ఈవెంటులో అజయ్ ఘోష్

Mangalavaram Pre Release Event

  • సందడిగా జరుగుతున్న 'మంగళవారం' ఈవెంట్
  • 'పుష్ప' తరువాత తన లెక్కవేరన్న అజయ్ ఘోష్  
  • తనకి ఇంతటి పేరు రావడానికి బన్నీ కారణమని వెల్లడి 
  • తనని బన్నీ ప్రోత్సహించాడని వ్యాఖ్య 


పాయల్ రాజ్ పుత్ ప్రధానమైన పాత్రగా అజయ్ భూపతి 'మంగళవారం' సినిమాను రూపొందించాడు. స్వాతి - సురేశ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ సంగీతాన్ని అందించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ - జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది.

ఈ వేదికపై నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ .. "నేను చాలామంది హీరోలతో చేస్తున్నాను. నా గుండెల్లో గూడుకట్టుకున్న హీరోల్లో మొట్టమొదటివాడు అల్లు అర్జున్. 'పుష్ప'కి ముందు అజయ్ ఘోష్ వేరు .. 'పుష్ప' తరువాత అజయ్ ఘోష్ లెక్కవేరు. నాకు ఇంతటి  పేరు రావడానికి కారకుడు సుకుమార్ .. అల్లు అర్జున్" అని అని అన్నారు. 

"అల్లు అర్జున్ తెలుగువాడి సత్తాను నేషనల్ లెవెల్లో చాటిచెప్పాడు. అలాంటి నటుడిని ఇంతవరకూ నేను చూడలేదు. నటుల్లో ఎవరైనా నటించేవారుంటే ఆయన ఎంతగా ప్రోత్సహిస్తాడనడానికి నేనే ఉదాహరణ. అలాంటి అర్జున్ గెస్టుగా వస్తున్నాడంటే 'మంగళవారం' మరో లెవెల్లో ఉంటుంది" అంటూ చెప్పారు.

Payal
Ajay Bhupathi
mangalavaram
  • Loading...

More Telugu News