mallu ravi: విజయశాంతి నేడో.. రేపో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు: మల్లు రవి

Mallu Ravi says Vijayasanthi will join congress soon

  • తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్న కాంగ్రెస్ నేత
  • కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా విజయశాంతి
  • కొన్ని రోజులుగా జోరుగా... పార్టీ మారుతారనే ప్రచారం

రాములమ్మ విజయశాంతి నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారన్నారు. ప్రస్తుతం విజయశాంతి బీజేపీలో ఉన్నారు. కొన్నిరోజులుగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి ఆమె పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది.  

mallu ravi
Vijayashanti
Congress
Telangana Assembly Election
  • Loading...

More Telugu News