Game Changer: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' నుంచి 'జరగండి' పాట విడుదల వాయిదా

Song release from Ram Charan Game Changer postponed

  • రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీ
  • కియారా అద్వానీ కథనాయిక... శంకర్ దర్శకత్వం
  • దీపావళికి ఓ పాట విడుదల చేయాలని భావించిన చిత్రబృందం
  • ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యలు వచ్చాయని తాజాగా వెల్లడి 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ చిత్రం నుంచి దీపావళి కానుకగా 'జరగండి' అనే పాటను విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే, అనుకోని కారణాలతో పాట విడుదల ఆలస్యం కానుంది. 

వివిధ సంస్థల మధ్య ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా 'జరగండి' పాటను విడుదల చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. పాట విడుదల వాయిదా వేశామని, త్వరలోనే మరో తేదీ ప్రకటిస్తామని పేర్కొంది. 

రామ్ చరణ్ అభిమానులు, శంకర్ అభిమానులు ఈ పాట కోసం ఎంతగా ఎదురుచూస్తుంటారో తాము అర్థం చేసుకోగలమని, 'గేమ్ చేంజర్' నుంచి ఏ కంటెంట్ విడుదల అయినా అత్యుత్తమంగా ఉంటుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనలో వివరించింది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తమ చిత్రబృందం అవిశ్రాంతంగా శ్రమిస్తోందని వెల్లడించింది. 

కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. గేమ్ చేంజర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Game Changer
Jaragandi Song
Postpone
Ram Charan
Shankar
  • Loading...

More Telugu News